: సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న సీపీఎం కార్యకర్తలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్ ను సీపీఎం కార్యకర్తలు అడ్డుకున్నారు. ఖమ్మం నగరంలో పర్యటిస్తున్న సీఎం నూతన బస్టాండ్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం రాపర్తినగర్ లో డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించి, తిరిగి వెళ్తుండగా సీపీఎం కార్యకర్తలు సీఎం కాన్వాయ్ ను అడ్డుకున్నారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయనకు వినతిపత్రాలు అందజేశారు. కాగా, రెండు రోజుల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఈరోజు ఖమ్మం నగరానికి విచ్చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్, కలెక్టర్, ఎస్పీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఖమ్మం నగర అభివృద్ధిపై సమీక్షలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కేసీఆర్ వెంట టీఆర్ఎస్ నేతలు కె.కేశవరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.