: విద్యార్థులది ముమ్మాటికీ జాతి వ్యతిరేకతే, ఇందిరాగాంధీ హిట్లరే!: విరుచుకుపడ్డ అమిత్ షా


జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో కొందరు విద్యార్థులు చేసింది ముమ్మాటికీ జాతి వ్యతిరేక చర్యలేనని, వాటిని రాహుల్ గాంధీ సమర్థించడం పూర్తి అవగాహనా రాహిత్యమేనని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతి వ్యతిరేక వ్యాఖ్యలకు, జాతీయ భావానికి మధ్య తేడా రాహుల్ కు తెలియడం లేదని ఆయన అన్నారు. ఈ మేరకు తన బ్లాగులో పలు కామెంట్లను పోస్ట్ చేస్తూ, మోదీ పాలన హిట్లర్ ను తలపిస్తోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎమర్జెన్సీ విధించి ఇందిరాగాంధీయే హిట్లర్ లా వ్యవహరించారని ఆరోపించిన అమిత్, ఆమె చర్యలు ఎటువంటివో కాంగ్రెస్ స్వయంగా పరిశీలించుకోవాలని ఎద్దేవా చేశారు. హిట్లర్ బుద్ధులు కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉన్నాయని నిప్పులు చెరిగారు. వర్శిటీకి వెళ్లి వేర్పాటు వాదుల అద్దె గొంతుకలా రాహుల్ మాట్లాడటం పూర్తి అవగాహనా రాహిత్యమని విమర్శించారు.

  • Loading...

More Telugu News