: ఇవాళ కాపులను కలిపితే రేపు రెడ్లు, బ్రాహ్మలు, కమ్మలు, వైశ్యులు వస్తే...?: కృష్ణయ్య


కాపుల్లో అత్యంత బీదరికం అనుభవిస్తున్న వారు ఎందరో ఉన్నారని, వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలనడంలో సందేహం లేదని అభిప్రాయపడిన బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య, కాపులను బీసీల్లో కలిపేందుకు మాత్రం ససేమిరా అన్నారు. నేడు కాపులను కలిపితే, రేపు రెడ్లు, బ్రాహ్మలు, కమ్మలు, వైశ్యులు కూడా వస్తారని, అప్పుడిక బీసీలకు అర్థమేంటని ఆయన ప్రశ్నించారు. అన్ని కులాల్లోనూ పేదలున్నారని వారి అభివృద్ధికి తోడ్పాటును అందించాల్సి వుందని అభిప్రాయపడ్డారు. ఏ కులానికి రిజర్వేషన్లు కల్పించినా అది శాస్త్రబద్ధంగా, ఓ పద్ధతి ప్రకారం జరగాలని సూచించారు. గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కాపులను బీసీల్లో కలిపితే హైకోర్టు కొట్టి వేసిందని గుర్తు చేశారు. తాను డబుల్ గేమ్ ను ఆడటంలేదని, తన జాతి కోసం చేస్తున్న పోరాటమిదని అన్నారు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలని చంద్రబాబు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News