: మాంసం తిన్నారని ప్రాణాలు తీయడం క్రూరమైన నేరం: తస్లీమా నస్రీన్
మాంసం తిన్నారన్న ఆరోపణలతో ప్రాణాలు తీయడం అసహనం కాదని.. అది క్రూరమైన నేరమని ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. ఇటువంటి చర్యలను ఆపాలంటూ ఆమె పిలుపు నిచ్చారు. దేశంలో అసహనానికి తావే లేదని, ఇక్కడి రాజ్యాంగం, న్యాయసూత్రాలను అందుకు ఆస్కారం లేకుండా రూపొందించారన్నారు. లౌకికి వాదులు అసహనానికి వ్యతిరేకంగా పోరాడుతుండటం మంచి పరిణామమన్నారు. తాను భారత్ లో ఉండటానికి అనుమతిస్తే సంతోషిస్తానని ఆమె పేర్కొన్నారు. పాక్ గాయకుడు అద్నాన్ సమీకి భారత పౌరసత్వం ఇవ్వడంపై తస్లీమా హర్షం వ్యక్తం చేశారు.