: ప్రముఖ మలయాళీ సినిమాటోగ్రాఫర్ ఆనంద కుట్టన్ కన్నుమూత
ప్రముఖ మలయాళీ సినిమాటోగ్రాఫర్ ఆనంద కుట్టన్(61) కన్నుమూశారు. ఈరోజు ఉదయం కోచిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మరణించారు. ఆయనకు భార్య గీత, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా, హిస్ హైనెస్ అబ్దుల్లా, మణి చిత్రాలు, భారతం, ఆకాశదూత్, కమలదళం లాంటి 150 సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా ఆయన పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1977లో 'మనసిల్ ఒరు మయిల్' సినిమాతో సినీ రంగానికి ఆనందకుట్టన్ పరిచయమయ్యారు.