: పోలీసుల అదుపులో ‘బ్రహ్మోత్సవం’ చిత్రం కెమెరామెన్లు!


ప్రిన్స్ మహేశ్ బాబు తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ కెమెరామెన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో రథసప్తమి వేడుకలను ఈ చిత్ర కెమెరామెన్లు ముగ్గురు వీడియో తీస్తున్నారు. ఎటువంటి అనుమతి లేకుండానే వీడియో తీస్తున్న వారిని టీటీడీ విజిలెన్స్ సాయంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ ముగ్గురిని విచారించగా, 'బ్రహ్మోత్సవం' చిత్రం కోసం తిరుమలలో రథసప్తమి వేడుకలను వీడియో తీస్తున్నామని.. ఆ దృశ్యాలను ఈ చిత్రంలో కలుపుతామని చెప్పినట్లు విచారణలో తెలిసింది. కాగా, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్లు కాజల్, సమంత, ప్రణీత నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News