: విండీస్ వేగానికి తడబడ్డ భారత కుర్రాళ్లు... మూడు వికెట్లు డౌన్
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో విండీస్ బౌలర్ల వేగానికి భారత ఆటగాళ్లు తడబడ్డారు. ఢాకాలో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన విండీస్ ఇండియాను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్ ఆర్ఆర్ పండ్ 1, ఇషాన్ కిషన్ 4, అన్ మోల్ ప్రీత్ సింగ్ 3 పరుగులకే ఔట్ అయ్యారు. విండీస్ బౌలర్ జోసఫ్ కు ఈ మూడు వికెట్లు దక్కడం విశేషం. జోసఫ్ విసురుతున్న నిప్పులు చెరిగే బంతులకు భారత టాప్ ఆర్డర్ వద్ద సమాధానం లేకపోయింది. ప్రస్తుతం భారత స్కోరు 8 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు. సుందర్ 6, ఖాన్ 0 పరుగులతో ఆడుతున్నారు.