: ఆనంద్ శర్మపై దాడి చేసిన బీజేపీ గూండాలు... విరుచుకుపడ్డ కాంగ్రెస్
జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మపై జరిగిన దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ విద్యార్థి విభాగం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన గూండాలు ఆయనపై దాడి చేశారని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా ఆరోపించారు. "భారత ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు. రాజ్యసభలో విపక్ష ఉప నేత ఆనంద్ శర్మపై బహిరంగ దాడి జరిగింది. ఆయనపై ఏబీవీపీ గూండాలు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం" అని ఆయన అన్నారు. కాగా, వర్శిటీ విద్యార్థుల అరెస్టు తరువాత జరుగుతున్న నిరసనలకు సంఘీభావం తెలిపేందుకు ఆనంద్ శర్మ వెళ్లిన సమయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే.