: పూటుగా తాగి పట్టుబడ్డ ప్రేమజంటలు
ప్రేమికుల రోజును ఘనంగా జరుపుకోవాలన్న ఆ జంటల కల నెరవేరలేదు సరికదా, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించింది. వేలంటైన్స్ డే సందర్భంగా గత రాత్రి 12 గంటల నుంచి హైదరాబాదు, బంజారాహిల్స్ లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించగా, పార్టీల అనంతరం పూటుగా మద్యం సేవించిన ప్రేమ జంటలు పట్టుబడ్డాయి. 5 కార్లు, 6 బైకులు నడుపుతున్న వారు మద్యం సేవించినట్టు తేలిందని, వీరి వాహనాలు సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. 5 కార్లలోనూ ప్రేమ జంటలే ఉండటం గమనార్హం. పట్టుబడిన వారికి కౌన్సెలింగ్ ఇచ్చి, కోర్టులో హాజరుపరచనున్నట్టు పోలీసులు తెలిపారు.