: వేలంటైన్స్ డే వేడుకలను బహిష్కరించండి... పాకిస్థాన్ అధ్యక్షుడి పిలుపు
ప్రపంచవ్యాప్తంగా రేపు జరుపుకోనున్న వేలంటైన్స్ డే వేడుకలను పాకిస్థాన్ లో బహిష్కరించాలని ఆ దేశ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ పిలుపునిచ్చారు. వేలంటైన్స్ డే అనేది పాక్ సంస్కృతి కాదని, పాశ్చాత్య దేశాల సంప్రదాయమని అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరించడమంటే మన విలువలను అగౌరవపరచడమేనని మమ్మూన్ పేర్కొన్నారు. గొప్ప నాయకుల సిద్ధాంతాలను పాటించడం వల్లే దేశం ఈనాడు వృద్ధి చెందిందని ఆయన చెప్పారు. మరోవైపు పెషావర్, కొహట్ జిల్లాల్లో ప్రేమికుల రోజు వేడుకలపై స్థానిక కౌన్సిల్ నిషేధం విధించింది. రేపటి రోజున ఎవరూ గ్రీటింగ్ కార్డులు, చాక్లెట్లు, కానుకలు ఇవ్వవద్దని కౌన్సిల్ ఛైర్మన్ ప్రకటించారు.