: ఇవాళ కేసీఆర్ కు... రేపు హరీశ్ రావుకు అమ్ముడుపోతారు: రేవంత్


అధికార పార్టీ టీఆర్ఎస్ పై టీ-టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవాళ కేసీఆర్ కు అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలందరూ రేపు హరీశ్ రావుకు అమ్ముడుపోయే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కేసీఆర్ ఆడుతున్న రాజకీయ క్రీడలో ఆయనే బలవక తప్పదని జోస్యం చెప్పారు. ప్రభుత్వ పనితీరుపై కోదండరాం, చుక్కా రామయ్య ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడంతో అక్కడ పార్టీ ఇన్ చార్జ్ ను నియమించే విషయంపై ఇవాళ రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ఇన్ చార్జ్ ను నియమిస్తామని చెప్పారు. 2019 ఎన్నికల్లో వంద నియోజకవర్గాల్లో కొత్తవారిని తీసుకొస్తామన్న రేవంత్, 50 శాతం సీట్లను బీసీలకే ఇస్తామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News