: హైదరాబాదులో ఆస్ట్రేలియా పోలీసు బృందం పర్యటన
ఆస్ట్రేలియా పోలీసు బృందం ఈరోజు హైదరాబాదులో పర్యటించింది. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను పరిశీలించింది. మాథ్యూస్ అనే పోలీసు అధికారి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల బృందం ముందుగా అబిడ్స్ పోలీస్ స్టేషన్ ను సందర్శించింది. తరువాత చిలకలగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. కేసుల నమోదు, దర్యాప్తు, నేరం జరిగితే నిందితులను గుర్తించే విధానం, సంఘటన స్ధలానికి ఎంత సమయంలో చేరుకుంటారు, బాధితులు పోలీస్ స్టేషన్ కు వస్తే ఎవరిని కలవాలి, వారు వ్యవహరించే విధానం వంటి అన్ని విషయాలను తెలుసుకుంటున్నారు. నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ పీవై యాదగిరి వారికి అన్ని వివరాలు తెలియజేశారు.