: తమిళనాడు ఎన్నికలలో డీఎంకేతో కలసి పోటీ చేస్తున్నాం: గులాంనబీ ఆజాద్
తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో కలసి పోటీ చేయాలని కాంగ్రెస్, డీఎంకే పార్టీలు నిర్ణయించుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీలు కలసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ తెలిపారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై త్వరలో ప్రకటన చేస్తామని చెప్పారు. చెన్నైలోని డీఎంకే అధినేత కరుణానిధి నివాసంలో దాదాపు గంటకుపైగా చర్చలు జరిపిన తరువాత పొత్తుపై ఆజాద్ మీడియాకు వెల్లడించారు. కాంగ్రెస్ కు డీఎంకే విశ్వసనీయ మిత్రపక్షమని ఆయన పేర్కొన్నారు.