: ఓయూను తాకిన జేఎన్ యూ సెగ!... ఏబీవీపీ, ఏఐఎస్ఎఫ్ ల మధ్య ఘర్షణ


ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో రాజుకున్న ఘర్ణణల సెగ హైదరాబాదులోని ఉస్మానియా వర్సిటీ (ఓయూ)ని తాకింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురుకు అనుకూలంగా ఓ విద్యార్థి సంఘం ర్యాలీ, దానిని వ్యతిరేకిస్తూ మరో విద్యార్థి సంఘం నిరసన... వెరసి జేఎన్ యూ భగ్గుమంది. దీనిపై వేగంగా స్పందించిన ఢిల్లీ పోలీసులు అఫ్జల్ గురుకు అనుకూలంగా, దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన విద్యార్థిని అరెస్ట్ చేశారు. దీనిని నిరసిస్తూ ఉస్మానియా వర్సిటీలో కొద్దిసేపటి క్రితం ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. దీనిపై సమాచారం అందుకున్న ఏబీవీపీ విద్యార్థులు ర్యాలీని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News