: నాడు గగ్గోలు పెట్టిన కేసీఆర్ ఇప్పుడెలా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు?: సీపీఐ నారాయణ


తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ను సీపీఐ నారాయణ ప్రశ్నించారు. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను దివంగత వైఎస్ ఆకర్ష్ కింద పార్టీలోకి ఆహ్వానించినప్పుడు కేసీఆర్ గగ్గోలు పెట్టారన్నారు. మరిప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను ఎలా వారి పార్టీలోకి తీసుకుంటారని నిలదీశారు. ఇలాంటి రాజకీయ వ్యభిచారులపై కేసులు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. వీరిపై కేసు పెట్టేంతవరకు వ్యభిచారం చేసే వేశ్యలపై కూడా కేసులు పెట్టకూడదని నారాయణ అన్నారు.

  • Loading...

More Telugu News