: వారం ముందుగానే గ్రీటింగ్స్ చెప్పిన మోదీ... ఆ పొరపాటు 'గూగుల్'దట!


పీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ మోదీ దేశ విదేశాల్లోని ప్రముఖులందరికీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ గనికి నిన్న(శుక్రవారం) ట్విట్టర్ లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వాస్తవానికి గని పుట్టిన రోజు మే 19న. గూగుల్ లో ఆయన పుట్టిన రోజు నిన్ననే అని ఉండటంతో మోదీ గ్రీటింగ్స్ చెప్పేశారు. మోదీ ట్వీటుకు స్పందించిన అష్రఫ్ ముందుగా కృతజ్ఞతలు చెప్పారు. అయితే తన పుట్టిన రోజు ఇవాళ కాదని... మే 19న అని తర్వాత అసలు విషయాన్ని చల్లగా చెప్పారు. ఈ పొరపాటుకు పలువురు సోషల్ మీడియాలో మోదీని విమర్శిస్తే... గూగుల్ లో ప్రముఖుల పుట్టినరోజు తేదీలను సరిగా అప్ డేట్ చేయడం లేదని మరి కొంతమంది అంటున్నారు.

  • Loading...

More Telugu News