: ‘అనంత’లో నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు... ముగ్గురి అరెస్ట్, యంత్ర సామగ్రి సీజ్


అనంతపురం జిల్లాలో నేటి ఉదయం నకిలీ నోట్ల ముఠా గుట్టను తాడిపత్రి పోలీసులు రట్టు చేశారు. తాడిపత్రి కేంద్రంగా భారీ ఎత్తున నకిలీ నోట్లు తయారవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో గుట్టుగా సాగుతున్న నకిలీ నోట్ల తయారీని పోలీసులు గుర్తించారు. ఈ సందర్భంగా ఆ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇక నకిలీ నోట్ల తయారీకి వినియోగిస్తున్న యంత్ర సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే తయారైన రూ.2 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్న మరో ముగ్గురి కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News