: శ్రీవారికి స్వర్ణకిరీటం సమర్పించుకున్న కోయంబత్తూర్ భక్తుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి కోయంబత్తూర్ కు చెందిన బాలమురుగన్ అపర్ణ అనే భక్తుడు రూ.కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించాడు. ముందుగా దానికి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణను కలసి కిరీటాన్ని అందజేశారు. అనంతరం భక్తుడికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.