: వెయ్యేళ్ల వివాదానికి తెర!... పోప్ తో రష్యన్ ఆర్థొడాక్స్ చర్చ్ మూల పురుషుడి భేటీ


క్రిస్టియానిటిలో వెస్టర్న్ క్రైస్తవులు (రోమన్ కేథలిక్కులు), ఈస్టర్న్ క్రైస్తవుల (రష్యన్ ఆర్థొడాక్స్) మధ్య కొనసాగుతూ వస్తున్న వెయ్యేళ్ల వివాదానికి ఎట్టకేలకు తెర పడింది. వెస్టర్న్ క్రిస్టియన్ల ప్రతినిధి పోప్ ఫ్రాన్సిస్, ఈస్టర్న్ ఆర్థొడాక్స్ మూల పురుషుడు కిరిల్ లు నిన్న భేటీ అయ్యారు. మధ్య ప్రాశ్చంలో క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా పోరు సాగించే క్రమంలో క్యూబాలో వీరిద్దరూ కలుసుకున్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకున్న వీరు, క్రిస్టియన్లపై జరుగుతున్న దాడులకు చరమగీతం పలికేందుకు చేతులు కలిపారు. ఐఎస్ఐఎస్ తరహా ఉగ్రవాద సంస్థల కారణంగా మధ్య ప్రాశ్చం, ఉత్తర ఆఫ్రికాలోని క్రైస్తవుల కుటుంబాలు నిర్మూలనకు గురవుతున్నాయని వారిద్దరూ ఓ సంయుక్త ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. క్యూబా రాజధాని హవానాలోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న వీరిద్దరి కలయికను ప్రత్యక్షంగా వీక్షించిన క్యూబా అధ్యక్షుడు రవుల్ క్యాస్ట్రో స్వాగతించారు.

  • Loading...

More Telugu News