: సిక్కోలుకు వైఎస్ జగన్... వంశధార నిర్వాసితులతో ముఖాముఖి
వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు ఉత్తరాంధ్రలోని వెనుకబడిన జిల్లా శ్రీకాకుళంలో పర్యటించనున్నారు. సిక్కోలు పర్యటన సందర్భంగా ఆయన వంశధార ప్రాజెక్టు నిర్వాసితులతో భేటీ కానున్నారు. ప్రాజెక్టు కారణంగా నిరాశ్రయులైన బాధితులతో ఆయన ముఖాముఖి నిర్వహించనున్నారు. బాధితులకు అందాల్సిన పరిహారం, పునరావాసాలపై ఆయన దృష్టి సారించనున్నారు. ఈ ముఖాముఖిలో బాధితుల నుంచి వ్యక్తమయ్యే సమస్యలపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. బాధితుల తరఫున పోరాటం సాగించేందుకే ఆయన అక్కడికి వెళుతున్నట్లు సమాచారం.