: కుక్కల బెడద నివారణకు చర్యలు చేపట్టండి: కేటీఆర్ ఆదేశాలు
హైదరాబాద్ నగరంలో కుక్కల బెడద నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ విషయమై గ్రేటర్ కమిషనర్ జనార్దన్ రెడ్డితో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఇందుకు సంబంధించి కచ్చితమైన ప్రణాళికను అమలు చేయాలని కేటీఆర్ సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, కుక్కలకు స్టెరిలైజేషన్ (పిల్లలు పుట్టకుండా) క్యాంపులు నిర్వహిస్తామని, అందుకు అవసరమైన చర్యలు చేపడతామని చెప్పారు. కాగా, హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి, ఉప్పల్, అంబర్ పేట, జియాగూడ, యూసఫ్ గూడ, రెహ్మత్ నగర్, చైతన్యపురి తదితర ప్రాంతాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉంది.