: భారత విద్యార్థులను ఆకర్షించేందుకు యూకే ప్రభుత్వ ఆఫర్లు


బ్రిటన్ లో చదువుతున్న భారత విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండటంతో మళ్లీ తమ దేశానికి విద్యార్థులను ఆకర్షించాలన్న ఉద్దేశంలో ఆ దేశ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్రభుత్వం తరపున ఇచ్చే ఉపకార వేతనాలను పెంచినట్టు యూకే ప్రభుత్వం తెలిపింది. గ్రేట్ బ్రిటన్ పథకంలో భాగంగా విదేశీ విద్యార్థులకు 59 అండర్ గ్రాడ్యుయేట్, 232 పోస్టు గ్రాడ్యుయట్ స్కాలర్ షిప్ లు ఇస్తున్నట్టు మినిస్టర్ కౌన్సిలర్ ఆఫ్ బ్రిటిష్ హై కమిషనర్ ఆండ్రూ సోపర్ వెల్లడించారు. దాంతో పాటు యూకేలో చదవాలనుకునే భారత విద్యార్థుల కోసం వీసాను కూడా సులభతరం చేసినట్టు తెలిపారు. పదిమంది విద్యార్థుల్లో 9 మందికి వీసా వచ్చేలా చేస్తున్నామన్నారు. గతంలో ఉండే బోగస్ కాలేజీలన్నింటినీ తొలగించామని, ఇప్పుడు గుర్తింపు పొందిన కాలేజీలు మాత్రమే తమ దేశంలో ఉన్నాయని వివరించారు.

  • Loading...

More Telugu News