: ఉపాధ్యాయులతో ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయి: ప్రధాని మోదీ


ఉపాధ్యాయులతో ఎందరివో జీవితాలు ముడిపడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో అఖిల భారతీయ ప్రచార్య సమ్మేళన్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచే విద్యా భారతి పాఠశాలలు నిస్వార్ధ సేవలకు నిదర్శనమని అన్నారు. అన్ని విద్యాలయాల్లో ఏం జరుగుతుందో ప్రధానాచార్యులు గుర్తించాలని ఆయన సూచించారు. విద్యార్థి జీవితాన్ని మార్చగలిగే శక్తి ఉపాధ్యాయులకే ఉందని, పిల్లల్ని బాగా చదివించటమే తల్లిదండ్రుల కల అని అన్నారు. చాలా మంది అధ్యాపకులు వెళ్లేందుకు ఇష్టపడనటువంటి దూర ప్రాంతాలకు విద్యాభారతి అధ్యాపకులు వెళ్లి పాఠాలు బోధిస్తూ, సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. సమాజంలో చాలామంది తమ అవసరాలనే వెతుకుతుంటారని, ఆ అవసరాలను విద్యాభారతి అధ్యాపకులు తీరుస్తున్నారని అన్నారు. విద్యాభారతికి చెందిన చాలా పాఠశాలలు పేద, అభివృద్ధికి నోచుకోని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయని, తద్వారా ఆయా వర్గాల జీవితాల్లో చాలా మార్పులు తెచ్చే ప్రయత్నం చేసిందని.. చాలా సేవ చేసిందని అన్నారు. అన్ని రాష్ట్రాల్లో ఈ పాఠశాలలు అగ్రస్థానంలో ఉండాలని మోదీ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 1100 మందికి పైగా ప్రధానాచార్యులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News