: ఎన్టీఆర్ తో కలిసి నటించిన మొదటితరం నటీనటులను ఘనంగా సన్మానిస్తాం: బాలకృష్ణ
ఎన్టీఆర్ తో కలిసి నటించిన మొదటితరం నటీనటులను ఘనంగా సన్మానించనున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ నెల 27, 28 తేదీల్లో హిందూపురంలో నిర్వహించనున్న లేపాక్షి ఉత్సవాల సందర్భంగా వారిని సన్మానిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు జాతీయస్థాయి నేతలను ఆహ్వానించామని, అంతర్జాతీయ ఖ్యాతి వచ్చేలా లేపాక్షి ఉత్సవాలను నిర్వహిస్తామని అన్నారు. లేపాక్షి ఉత్సవాల నిర్వహణా ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు బాలకృష్ణ తెలిపారు.