: చివరి క్షణంలో మనసు మార్చుకున్న చిన్నారి సూసైడ్ బాంబర్!


తనకు ఇష్టం లేకుండానే బోకోహరామ్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఒక చిన్నారి సూసైడ్ బాంబర్ రంగంలోకి దిగింది. ఈశాన్య నైజీరియాలోని దిక్వా శరణార్థ శిబిరం వద్ద ఆత్మాహుతికి పాల్పడేందుకని ఆ బాలికతో పాటు మరో ఇద్దరు సూసైడ్ బాంబర్లను అక్కడికి తరలించారు. పేలుడు పదార్థాలు అమర్చిన జాకెట్లను ఆ ముగ్గురు ధరించారు. మారణహోమం సృష్టించేందుకు సమాయత్తమవుతున్న వేళ, ఒక్కసారిగా ఆ బాలిక మనస్సు మారింది. ఆత్మాహుతికి పాల్పడి వేలమందిని పొట్టనపెట్టుకోవడం తన వల్ల కాదని భావించింది. అంతే.. తాను ధరించిన పేలుడు పదార్థాల జాకెట్ ను తీసి పక్కన పడేసింది. అక్కడి నుంచి వెళ్లిపోయింది. మిగిలిన ఇద్దరు సూసైడ్ బాంబర్లు మాత్రం దిక్వా శరణార్థుల శిబిరం వద్ద తమను తాము పేల్చుకుని అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. అయితే, తనను తాను పేల్చుకోవడానికి ఇష్టపడని ఆ చిన్నారి సూసైడ్ బాంబర్ ను స్థానిక రక్షక దళాలు గుర్తించాయి. అమాయక ప్రజలను హతమార్చుతున్నామనే విషయాన్ని తెలుసుకున్న ఆ బాలిక చాలా మథనపడిందని, అదే సమయంలో, తనను ఆత్మాహుతికి పాల్పడాలన్న ఉగ్రవాద నాయకుల ఆదేశాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నందుకు భయపడిందని స్థానిక స్వీయ రక్షక దళ సభ్యుడు మొదూ అవామీ పేర్కొన్నారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న ఆ బాలిక ఉగ్రవాదులకు సంబంధించిన మరిన్ని వివరాలను చెబుతోంది. కాగా, దిక్వా పట్టణంలో ఇద్దరు బాలికలు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ సంఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.

  • Loading...

More Telugu News