: కేక్ తయారు చేయడం భలే సరదాగా ఉంది: తమన్నా
కేకు తయారు చేయడం భలే సరదాగా ఉందని ప్రముఖ నటి తమన్నా తెలిపింది. సాధారణంగా సినీ నటులు వంటగది వైపు వెళ్లడమే అరుదుగా జరుగుతుంటుంది. తమన్నా కూడా అంతే... ఆమెకీ కిచెన్ అనుభవం లేదు. అయితే తాజాగా పాకశాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించేందుకు వంటగదిలో అడుగు పెట్టింది. అందుకు పెద్ద కసరత్తే చేసిందండోయ్...కప్ కేక్స్ తయారు చేయడం ఎలా? అని స్నేహితురాళ్లను అడిగి తెలుసుకుని వంటగదిలో సత్తాచాటింది. ఈ సందర్భంగా కప్ కేక్స్ తయారు చేయడం భలే సరదాగా ఉంది అని చెప్పింది. ఆ సందర్భంగా తీసుకున్న ఫోటోను తన ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేసింది. తనకు సలహాలు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలిపింది.