: భారత్ విద్యార్థులను కావాలని అవమానించలేదు: యూఎస్ రాయబారి


ఉన్నతవిద్య కోసం అమెరికాకు వచ్చిన భారత్ విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని, ప్రవేశాల్లో రెండంచెల విధానాన్ని గుర్తించలేకనే విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని భారత్ లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిపై అమెరికాతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సాయంత్రం ఒప్పందం చేసుకోనుంది. ఈ నేపథ్యంలో విశాఖలో స్మార్ట్ సిటీల అభివృద్ధిపై సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖ స్మార్ట్ సిటీ బృహత్ ప్రణాళిక తయారీకి తమ సహకారమందిస్తామన్నారు. భారత్-అమెరికా సంబంధాలను ఈ ఏడాది మరింత బలోపేతం చేస్తామన్నారు. రాబోయే కాలంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్యాన్ని విస్తృతం చేస్తామని, 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. లక్ష్యానికి అనుగుణంగా రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయని, అమెరికా ఎగుమతి, దిగుమతుల్లో భారత్ వాటా రెండు శాతం మాత్రమే ఉందని అన్నారు. ఎగుమతి, దిగుమతుల్లో విస్తరణకు చాలా అవకాశాలున్నాయని, రక్షణ రంగంలో సహకారానికి మరింత ప్రాధాన్యమిస్తామన్నారు.

  • Loading...

More Telugu News