: 12 అంశాలతో మోదీకి కేసీఆర్ వినతిపత్రం... రూ.30వేల కోట్ల ఆర్థికసాయం చేయాలని విజ్ఞప్తి
ప్రధాని మోదీతో ఈరోజు 40 నిమిషాలకు పైగా సమావేశమైన సీఎం కేసీఆర్ పలు విజ్ఞప్తులతో వినతిపత్రం సమర్పించారు. మొత్తం 12 అంశాలతో కూడిన ఓ లేఖను అందించారు. రాష్ట్రానికి వచ్చే నాలుగేళ్లకు గానూ ప్రత్యేక గ్రాంట్ గా రూ.30వేల కోట్ల సాయం చేయాలని, సాధారణ, రైల్వే బడ్జెట్ లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని తెలిపారు. ఉమ్మడి హైకోర్టును విభజించాలని, తెలంగాణకు 30 మంది ఐపీఎస్ లను కేటాయించాలని కోరారు. వరంగల్ ట్రైబల్ యూనివర్సిటీకి సెంట్రల్ వర్సిటీ హోదా ఇవ్వాలని, టాటా ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని, ఎయిమ్స్ ను వెంటనే ప్రారంభించాలని అభ్యర్థనల చిట్టా విప్పారు. ఇక వార్షిక రుణపరిమితిని 0.5 శాతం పెంచాలని, మిషన్ భగీరథకు రూ.10వేల కోట్ల ఆర్థిక సాయం చేయాలని ప్రధానికి విన్నవించారు.