: ఏం చూసి మీ పార్టీలో చేరతారు?... టీడీపీ ‘ఆకర్ష్’పై వైసీపీ నేత రోజా ఫైర్
తెలంగాణలో టీఆర్ఎస్ ‘ఆకర్ష్’ తరహాలోనే ఏపీలో టీడీపీ వలకు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలు చిక్కారంటూ వస్తున్న వార్తలపై వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె టీడీపీ పాలనపై విరుచుకుపడ్డారు. అసలు ఏం ఒరగబెట్టారని మీ పార్టీలో చేరతారంటూ ఆమె టీడీపీ నేతలను ప్రశ్నించారు. అయినా మీరు ప్రచారం చేస్తున్న విషయం వాస్తవమే అయితే, ఇప్పటిదాకా ఒక్క ఎమ్మెల్యే కూడా మీ పార్టీలో ఎందుకు చేరలేదని ఆమె టీడీపీని నిలదీశారు.