: ధోనీ సేనను ఓడించడం కష్టమేనంటున్న ఆసీస్ ఆల్ రౌండర్ వాట్సన్


టెస్టులు, వన్డేల్లో ఎలా ఉన్నా, టీ20ల్లో మాత్రం టీమిండియా సత్తా ఉన్న జట్టే. ఇదేదో మన దేశ జట్టుకు మనం ఇస్తున్న కితాబు కాదు. క్రికెట్ లోనే పహిల్వాన్ గా పేరుగాంచిన ఆస్ట్రేలియా జట్టులోని ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ఇచ్చిన కాంప్లిమెంటు. టీ20 వరల్డ్ కప్ కు సమయం ఆసన్నమవుతున్న క్రమంలో ఇటీవల తమ దేశంలో పర్యటించిన టీమిండియా ప్రదర్శనకు ఆసీస్ జట్టు బెంబేలెత్తిపోయింది. వరుసగా నాలుగు వన్డేల్లో గెలిచిన ఆ జట్టు ఆ తర్వాత చతికిలబడింది. ఐదు వన్డేల సిరీస్ లో చివరి వన్డేలో జూలు విదిల్చిన ధోనీ సేన... ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లో ఆసీస్ ను వైట్ వాష్ చేసేసింది. ఇక చివరి టీ20లో ఆసీస్ కెప్టెన్ గా బరిలోకి దిగిన వాట్సన్ ఏకంగా శతకం బాదినా, ఆ జట్టుకు టీమిండియా చేతిలో పరాభవం తప్పలేదు. ఆ మ్యాచ్ లో టీమిండియా సత్తా తెలిసివచ్చిందేమో... నిన్న వాట్సన్ సంచలన ప్రకటన చేశాడు. టీ20ల్లో భారత్ ను ఓడించడం కష్టమేనని పేర్కొన్న అతడు రానున్న టీ20 వరల్డ్ కప్ లో ఫేవరెట్ టీమిండియానేనని తేల్చిచెప్పాడు.

  • Loading...

More Telugu News