: డిప్యూటీ మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన బాబా ఫసియుద్దీన్
జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. తన కార్యాలయంలో అధికారులు, అనుచరుల సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఫసియుద్దీన్ కు పలువురు పూల బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. మరి కాసేపట్లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే ఆయన కార్యాలయాన్ని అధికారులు అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది.