: టీటీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నాం... స్పీకర్ కు ఎర్రబెల్లి లేఖ
ఇప్పటికే పదిమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న టీఆర్ఎస్... పార్టీ వారికి పిరాయింపుల చట్టం వర్తించకుండా చూసుకుంటోంది. అందుకనుగుణంగా తాజాగా ఆ పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావు టీటీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన స్పీకర్ మధుసూదనాచారికి లేఖ రాశారు. అసెంబ్లీలో తమదే అసలైన టీడీపీగా గుర్తించాలని, 2/3 వంతు ఎమ్మెల్యేలు తమవైపే ఉన్నారని తెలిపారు. టీడీఎల్పీ నేతగా మెజార్టీ ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్టు లేఖలో వెల్లడించారు. ఇప్పటికే టీడీపీలోని 15 మందిలో 10 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరగా, త్వరలో మరో ఒకరిద్దరు కూడా చేరతారని తెలుస్తోంది.