: అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండీకి 14 రోజుల రిమాండ్
అగ్రిగోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్, సీఎండీ అవ్వా వెంకటరామారావు, ఎండీ అవ్వా వెంకట శేషునారాయణలకు ఏలూరు రెండో అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు రిమాండ్ విధించింది. నిన్న(రాత్రి) అరెస్టయిన వారిద్దరిని ఏలూరులోని పోలీస్ అతిథిగృహంలో విచారించారు. ఈ ఉదయం సీఐడీ అధికారులు వారిని కోర్టులో హాజరుపర్చారు. ఈ సమయంలో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ముందుగా వారిద్దరినీ తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ పిటిషన్ దాఖలు చేయగా న్యాయమూర్తి తిరస్కరించారు. అనంతరం 14 రోజుల జుడీషియల్ రిమాండ్ కు ఆదేశించారు. తదుపరి విచారణను ఈ నెల 19కి కోర్టు వాయిదా వేసింది.