: జైషే, లష్కరే ఉగ్రవాదులకు ఐఎస్ఐ ట్రైనింగ్: ముషార్రఫ్ సంచలన వ్యాఖ్య


పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడిలో తమ దేశానికి చెందిన వారి పాత్రేమీ లేదని పాకిస్థాన్ వాదిస్తోంది. ఈ దాడిలో లభించిన పలు కీలక ఆధారాలను భారత్ అందించినా, పాక్ తన మొండి వాదననే వినిపిస్తోంది. అయితే ఆ దేశానికి అధ్యక్షుడిగానే కాక సైన్యాధిపతిగా కూడా పనిచేసిన జనరల్ పర్వేజ్ ముషార్రప్ మాత్రం భారత్ వాదనకు మద్దతిచ్చేలా సంచలన ప్రకటన చేశారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై దాడి జైషే మొహ్మద్ పనేనని వెల్లడైన సంగతి తెలిసిందే. సదరు ఉగ్రవాద సంస్థతో పాటు లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాదులకు పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) శిక్షణ ఇస్తోందని ముషార్రఫ్ పేర్కొన్నారు. ‘ఇండియా టుడే’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో భాగంగా ముషార్రఫ్ పలు సంచలన ప్రకటనలు చేశారు. దాయాది దేశాల మధ్య సుదీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న కాశ్మీర్ కు అంతిమ పరిష్కారం లభించేదాకా భారత్ పై ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉంటాయని కూడా ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News