: సియాచిన్ పై ఒక ఒప్పందానికి రావాలి: పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్
సియాచిన్ పై భారత్, పాక్ లు ఒక ఒప్పందానికి రావాల్సిన సమయం ఆసన్నమైందని భారత్ లో పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రెండు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి సియాచిన్ లో పహారా కాయాల్సిన అవసరం లేకుండా సైనికులను వెనక్కి పిలవవచ్చని అన్నారు. రెండు దేశాలకు చెందిన ఎందరో సైనికుల ప్రాణాలు కాపాడేందుకు ఈ ఒప్పందం చాలా అవసరం అని ఆయన పేర్కొన్నారు. సియాచిన్ లో తాజాగా జరిగిన ఈ విషాదం రెండు దేశాల మధ్య వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తోందని ఆయన చెప్పారు.