: టీఆర్ఎస్ లో చేరనున్న మరో టీడీపీ ఎమ్మెల్యే


తెలంగాణలో టీడీపీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలోని ముఖ్యనేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమావేశమై, కార్యకర్తల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసిన కాసేపట్లోనే మరో టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరనున్నారు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడానికి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ఆయన తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఆయన సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరడమే లాంఛనమని సమాచారం. కాగా, చంద్రబాబునాయుడు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న వెంటనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం టీడీపీని ఇబ్బంది పెట్టే అంశమే. కాగా, రాజేందర్ రెడ్డి వ్యక్తిగత సమస్యల కారణంగానే టీఆర్ఎస్ లో చేరుతున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News