: నంది అవార్డుల పేరు మారుస్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
నంది అవార్డుల పేరును మారుస్తామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాదులో సినీ ప్రముఖులతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిత్రపురిలో సినీ కార్మికులకు ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. 2011వ సంవత్సరం నుంచి సినిమా అవార్డులను అందజేస్తామని ఆయన చెప్పారు. హైదరాబాదు వేదికగా నిర్వహించే చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎక్కువ షోలు వేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ తరహాలో హైదరాబాదులో ఓ సంస్థను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సినీ పరిశ్రమలో అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ఆయన తెలిపారు.