: ఏ కులం ఎంత దోచుకుందో తేలుద్దాం... బహిరంగ చర్చకు సిద్ధమా?:కత్తి పద్మారావు


నవ్యాంధ్ర రాజధానిలో ఏ కులానికి చెందిన వారు ఎంత దోచుకుంటున్నారో బహిరంగంగా చర్చించడానికి సిద్ధమా? అని దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు ప్రభుత్వానికి సవాలు విసిరారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, 'కుల వివక్ష చూపుతోంది మీరు కాదా?' అని అధికారపార్టీని ప్రశ్నించారు. ఈ బహిరంగ చర్చలో తాను ఓటమిపాలైతే వంద కోట్ల రూపాయలు ఇస్తానని, అదే సీఎం చంద్రబాబు ఓటమిపాలైతే పదవికి రాజీనామా చేస్తారా? అని అడిగారు. రాజ్యాంగాన్ని రూపొందించిన బీఆర్ అంబేద్కర్ కులంలో పుట్టినందుకు గర్విస్తున్నామని ఆయన చెప్పారు. దళితులను అవమానించినందుకు చంద్రబాబును అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News