: ఇష్రత్ జహాన్ ను పొగిడిన వారు ఇప్పుడు క్షమాపణ చెప్పాలి: బీజేపీ డిమాండ్
లష్కరే తోయిబా సంస్థలో ఇష్రత్ జహన్ సభ్యురాలంటూ డేవిడ్ హెడ్లీ తెలపడంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2004లో గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇష్రత్ జహాన్ మరణించింది. అయితే అది ఫేక్ ఎన్ కౌంటర్ అని, అమాయకురాలైన ఓ విద్యార్థిని చంపారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ మోదీపైనా, బీజేపీపైనా అప్పట్లో విమర్శలు చేశాయి. తాజాగా జహాన్ లష్కరే సభ్యురాలని హెడ్లీ చెప్పడంతో బీజేపీ వర్గాలు ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నాయి. జహాన్ కేసును అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ తమపై తీవ్ర ఆరోపణలు చేసిందని, ఇప్పుడు అసలు విషయం బయటపడింది కాబట్టి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దానిపై ఆమె వివరణ ఇవ్వాలని బీజేపీ నేత షానవాజ్ హుస్సేన్ డిమాండ్ చేస్తూ, రాజకీయ దురుద్దేశంతో చేసిన అప్పటి ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. అంతేగాక దేశ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు.