: చంద్రబాబును జలీల్ ఖాన్ ఎందుకు కలిశారంటే..: దేవినేని
రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ నేటి ఉదయం విజయవాడ పశ్చిమ శాసన సభ్యుడు, వైకాపా నేత జలీల్ ఖాన్, ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన సంగతి తెలిసింది. వీరిద్దరి కలయిక కొత్త చర్చలకు దారితీయగా, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. జలీల్ ఖాన్, తన నియోజకవర్గ అభివృద్ధి పనుల విషయమై చర్చించేందుకు చంద్రబాబుతో భేటీ అయ్యారని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలంతా అభివృద్ధిని కోరుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు చేపట్టిన వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో తమకు భాగస్వామ్యం కావాలని కోరుతున్నారని, ఈ నేపథ్యంలోనే జలీల్ ఖాన్ సీఎంను కలిసేందుకు వచ్చారని తెలిపారు.