: టీఆర్ఎస్ లో చేరాలని బెదిరిస్తున్నారు: మాగంటి గోపీనాథ్
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాలని తనపై ఒత్తిడి తెస్తూ బెదిరింపులకు దిగుతున్నారని తెలుగుదేశం జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వ్యాఖ్యానించారు. తాను రానని చెప్పిన మీదటే ఓటుకు నోటు కేసులో ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. కొద్ది సేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, ఆ కేసుతో తనకు ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. తాను ఎటువంటి బెదిరింపులకూ భయపడేది లేదని, టీడీపీలో పుట్టిన తాను టీడీపీలోనే కొనసాగుతానని తెలిపారు. టీఆర్ఎస్ దుశ్చర్యలను ప్రజలకు వివరిస్తానని తెలిపారు.