: అమెరికాలో తిరుపతి విద్యార్థి ప్రవీణ్ గల్లా మృతి... న్యూపోర్ట్ బీచ్ లో శవమై తేలిన వైనం


అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లిన తెలుగు విద్యార్థి ప్రవీణ్ గల్లా చనిపోయాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ పుల్లెర్టన్ లో విద్యనభ్యసిస్తున్న ప్రవీణ్ ఈ నెల 2 నుంచి కనిపించకుండాపోయాడు. తాజాగా అతడి మృతదేహం న్యూపోర్ట్ బీచ్ లో లభించింది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన ప్రవీణ్ గల్లా కొంతకాలం క్రితమే ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడి పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయన్న కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ప్రవీణ్ గల్లా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అతడి స్నేహితులు చెబుతున్నారు. ఈ కారణంగానే అతడు ఈ నెల 2 నుంచి కనిపించకుండాపోయాడని కూడా వారు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అక్కడి పోలీసులు అసలు విషయాన్ని నిగ్గు తేల్చేందుకు రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News