: హైదరాబాదుకు చంద్రబాబు.. పార్టీ తాజా పరిస్థితిపై 4 గంటలకు సమీక్ష
నిన్నటిదాకా టీ టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు సహచర పార్టీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తో కలసి నిన్న సాయంత్రం కీలక నిర్ణయం తీసుకున్నారు. టీడీపీని వీడి వారిద్దిరూ నేరుగా తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరిపోయారు. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు ఒకింత షాక్ కే గురయ్యారు. దీంతో వారిని సస్పెండ్ చేస్తూ ప్రకటన జారీ చేయడమే కాక, టీ టీడీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని నియమించాలని కోరుతూ ఆయన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో నేటి మధ్యాహ్నం చంద్రబాబు హైదరాబాదుకు వస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు టీ టీడీపీ ఎమ్మెల్యేలతో ఆయన ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఎర్రబెల్లి, ప్రకాశ్, వివేకానందల రాజీనామా తర్వాత పార్టీ పరిస్థితి, భవిష్యత్తుపై ఈ భేటీలో కీలక చర్చ జరగనున్నట్లు సమాచారం.