: గ్రేటర్ మేయర్ గా బొంతు రామ్మోహన్ ఖరారు
గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ అభ్యర్థిగా బొంతు రామ్మోహన్ ను టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. జీహెచ్ఎంసీ మేయర్ పదవి కోసం టీఆర్ఎస్ పార్టీలో నలుగురు వ్యక్తుల మధ్య పోటీ జరిగినట్టు తెలుస్తోంది. అయితే, రామ్మోహన్ వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపినట్టు సమాచారం. దీంతో రేపు ఉదయం మేయర్ ఎన్నిక లాంఛనాలను టీఆర్ఎస్ పార్టీ పూర్తి చేయనుంది. డిప్యూటీ మేయర్లుగా ఇద్దర్ని నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. వీరిలో ఒకరిగా ఫసియుద్దీన్ ను ఇప్పటికే ఎంపిక చేశారు. రెండో డిప్యూటీ మేయర్ పై రేపు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.