: టీఆర్ఎస్ ను బొందపెట్టే రోజు ఇక ఎంతో దూరంలో లేదు: రేవంత్ రెడ్డి


'టీఆర్ఎస్ లో ఎర్రబెల్లి చేరిక' అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పందించారు. ఓ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ, ఎర్రబెల్లి పార్టీ మారినంత మాత్రాన టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని అన్నారు. నైతిక విలువలు లేకుండా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ను ప్రజలు బొందపెట్టే రోజు ఇక ఎంతో దూరంలో లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు ఎంతో కాలం పని చేయవని, ప్రజలు అంతా గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు. నేతలు పార్టీలు ఎందుకు మారుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News