: హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్!
జీహెచ్ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్ పేరు ఖరారు అయింది. ఈ రాత్రికి లేదా రేపు ఉదయం ఆయన పేరును అధికారికంగా ప్రకటించనున్నారు. మేయర్ గా రామ్మోహన్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ గా బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వారంరోజుల క్రితం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 99 డివిజన్లలో విజయకేతనం ఎగురవేసి రికార్డు నెలకొల్పింది. టీఆర్ఎస్ తర్వాత చెప్పుకోదగ్గ స్థానాల్లో మజ్లిస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే.