: ఫైల్ తయారు చేశా... మన మంత్రుల జాతకాలన్నీ నా దగ్గరున్నాయ్: శివాజీ


మన కేంద్ర మంత్రుల చిట్టాలన్నీ తన దగ్గర ఉన్నాయని సినీ నటుడు, ప్రత్యేకహోదా సాధన సమితి అధ్యక్షుడు శివాజీ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేంద్ర మంత్రుల ఆస్తులపై ఓ ఫైల్ తయారు చేశానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు రాజకీయాల్లోకి రాకముందు ఉన్న ఆస్తులు, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత సంపాదించిన ఆస్తులపై ఓ పెద్ద ఫైల్ తయారు చేశానని, దానిని వామపక్ష పార్టీల ఎంపీల ద్వారా బడ్జెట్ సమావేశాల్లో చర్చించే ప్రయత్నం చేస్తున్నానని ఆయన చెప్పారు. కాపులకు న్యాయం చేస్తామని అన్ని పార్టీలు మ్యానిఫెస్టోల్లో తెలిపాయని, ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీసీలకు అన్యాయం జరగకుండా న్యాయం చేయండి అని ఆయన సూచించారు. రాజకీయాల్లో ఎవరూ శాశ్వతంగా ఉండరని ఆయన అన్నారు. రాజకీయాల్లో ఉంటే కనుక మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావులా బతకాలని ఆయన సూచించారు. ప్రత్యేకహోదాపై తమ ప్రయత్నం ఆగదని తెలిపిన ఆయన, ప్రత్యేకహోదా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News