: కేసీఆర్ తో నాకెటువంటి విభేదాలు లేవు: హరీష్ రావు


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని టీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. పార్టీలో నెంబర్-2 అంటూ ఎవరూ లేరని, కేసీఆర్ నాయకత్వంలోనే అందరం పనిచేస్తామని అన్నారు. కేసీఆర్ కు ఇంకా 20 ఏళ్లు పాలించే సామర్థ్యం ఉందని, మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో 50 వేల మెజార్టీతో టీఆర్ఎస్ గెలుపు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలో టీడీపీికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. కాంగ్రెస్ పాలకులు ఫ్యాక్షన్ తరహాలో తమ పాలన సాగించారని హరీష్ రావు మండిప్డడారు.

  • Loading...

More Telugu News