: ఆ విషయాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు: జూపూడి
కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆమరణ నిరాహార దీక్ష విరమించడాన్ని వైఎస్సార్సీపీ అధినేత జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు. డబ్బు, అధికారం కోసం జగన్ దేనికైనా సిద్ధపడతారని ఆరోపించారు. కులాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను వక్రీకరించడం సిగ్గుచేటన్నారు. ఎస్సీలపై జగన్ కు ఏమాత్రం ప్రేమ ఉందో తమకు తెలుసని, దళితుల ముసుగులో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నాడు అసెంబ్లీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై చర్చ జరగకుండా అడ్డుకున్న వారు దళితులకు శ్రేయోభిలాషులు ఎలా అవుతారని జూపూడి ప్రశ్నించారు.