: ఆ విషయాన్ని కత్తితో పొడిచి మరీ చెప్పగలను: రాంగోపాల్ వర్మ


విజయవాడ హత్యారాజకీయాల గురించి తనకంటే బాగా తెలిసిన వారు ఎవరూ లేరని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెలిపారు. విజయవాడ రౌడీయిజాన్ని 30 ఏళ్ల క్రితం అక్కడ ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో ప్రత్యక్షంగా చూశానని వర్మ చెప్పారు. అందుకే విజయవాడలో రౌడీయిజం, రాజకీయం గురించి తనకంటే బాగా తెలిసినవాడు ఎవడూ లేడని బల్లగుద్ది మరీ చెప్పగలనని...కాదు కాదు కత్తితో పొడిచి మరీ చెప్పగలనని ఆయన విడుదల చేసిన ఆడియో ప్రకటనలో వర్మ పేర్కొన్నారు. చలసాని వెంకటరత్నం హత్యతో మొదలైన విజయవాడ రౌడీ రాజకీయాల చరిత్ర తన 'వంగవీటి' సినిమాలో క్లియర్ గా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో వంగవీటి రాధా, వంగవీటి రంగ, వంగవీటి రత్నకుమారి, దేవినేని గాంధీ, దేవినేని నెహ్రూ, దేవినేని మురళి, కర్నాటి రామమోహనరావు, 'సీరీస్' రాజు, దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం మరియు ఎన్టీ రామారావు కనిపిస్తారని వర్మ చెప్పారు.

  • Loading...

More Telugu News